Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ముస్త్యాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

Author
Posted By AKSHAYA NEWS
| 10 Oct 2026, 08:13 AM |
ముస్త్యాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

నడి కూడ అక్టోబర్ 9 అక్షయ న్యూస్:

నడికుడ మండలం ముస్త్యాలపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా “మన పండుగలు – మన సంస్కృతి – మన సంప్రదాయాలు” అనే అంశంపై తల్లులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
మన పండుగలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, మన సంస్కృతికి, సామాజిక ఐక్యతకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడం, పిల్లల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.పాఠశాల విద్యతో పాటు సాంస్కృతిక విలువలను విద్యార్థులకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పావని, సత్యపాల్, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

ముస్త్యాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - Additional Imageముస్త్యాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - Additional Image