ముస్త్యాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
నడి కూడ అక్టోబర్ 9 అక్షయ న్యూస్: నడికుడ మండలం ముస్త్యాలపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా “మన పండుగలు – మన సంస్కృతి – మన సంప్రదాయాలు” అనే అంశంపై తల్లులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మన పండుగలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, మన సంస్కృతికి, సామాజిక ఐక్యతకు, ప్రకృతితో...