Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అధికారుల గై హాజరు తీరుపై సర్పంచులు ఫైర్..

Author
Posted By AKSHAYA NEWS
| 15 Sep 2026, 08:43 PM |
అధికారుల గై హాజరు తీరుపై సర్పంచులు ఫైర్..

గై హాజరైన అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలి..

పరకాల మండల పరిషత్ లో మండల సమన్వయ సమీక్ష..

పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం మండల సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత తహసిల్దార్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 10 గ్రామాల సర్పంచులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు గ్రామాలలో ఉన్న సమస్యలపై సర్పంచులు అధికారులకు వివరించారు.

వెంకటాపురం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి

**మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకటాపురం సర్పంచ్ రాజేశ్వరరావు**


మండలంలోని వెంకటాపురం గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా పక్క గ్రామం హై బోత్ పల్లి వెంకటాపురం ఆర్టీసీ బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సర్పంచ్ తెలియపరచడం జరిగింది స్పందించిన అధికారులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు


కామారెడ్డి పల్లి గ్రామం వద్ద ఎక్స్ బస్సులు ఆపేలా చూడాలి

ఇవి కూడా చదవండి

**అలియాబాద్ సర్పంచ్ సనత్**

కామారెడ్డి పల్లి గ్రామ ప్రజలకు ఆర్టీసీ బస్సులు ఆపకపోయేసరికి అక్కడి నుండి పరకాల కి ఆటోలో రావాలంటే 150 నుండి 200 రూపాయలు కిరాయి పెట్టుకొని రావడం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం వరకేనా దానిని అమలు చేసేది ఉందా లేదా అని అలియాబాద్ సర్పంచ్ అధికారులను నిలదీశాడు ఇకనుండి కామారెడ్డి పల్లి బస్ స్టాప్ వద్ద ఎలాంటి బస్సులైనా ఆ పిల్ల చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్సు స్టాప్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు


పరకాలకు ఆర్ అండ్ బి అధికారులు ఉన్నట్టా లేనట్టా..

**నాగారం గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి*"

మండలంలోని నాగారం గ్రామ మొదటినుండి గ్రామ చివరి వరకు ఆర్ అండ్ బి రోడ్డు చాలా ప్రమాదంగా గుంతలమయం కావడం జరిగిందని గుంతలు ఏర్పడి సుమారు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు పట్టించుకునే ఆర్ అండ్ బి అధికారులే కరువయ్యారని మండిపడ్డారు మొగుళ్ళ పల్లి జమ్మికుంటకు ప్రధాన రహదారి అయినా ఈ ఆర్ అండ్ బి రోడ్డు గుంతలమయం కావడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు గై హాజరైన ఆర్ అండ్ బి శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అట్టి గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు

**గై హాజరైన అధికారులపై ఎంపీడీవో కలెక్టర్ కు ఫిర్యాదు*"

అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండల సమన్వయ సమీక్ష సమావేశానికి గై హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ కు వెంటనే ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలియజేశారు