Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అడ్డగిస్తే సాకి రేవు గుట్టపైనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం...

Author
Posted By AKSHAYA NEWS
| 22 Sep 2026, 09:19 PM |
అడ్డగిస్తే సాకి రేవు గుట్టపైనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం...

అడ్డగిస్తే సాకి రేవు గుట్టపైనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం...

అన్ని అనుమతులు ఉన్న ఈ అడ్డంకులు ఎందుకు.?

గ్రామ ప్రథమ పౌరుడు ఆర్థికంగా డిమాండ్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మీడియా సమావేశంలో కాంట్రాక్టర్ వెల్లడి


నడికూడ సెప్టెంబర్ 22 అక్షయ న్యూస్
నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామ పరిధిలోని సాకి రేవుగుట్టలో మైనింగ్‌ పనులకు స్థానిక సర్పంచ్‌ అడ్డంకులు సృష్టిస్తూ ఆర్థికంగా డిమాండ్ చేస్తున్నారని క్రీస్తు జ్యోతి కాంట్రాక్టర్‌ బరిగెల కుమారస్వామి . బరిగెల రాధికతో కలిసి మీడియా సమావేశంలో ఆరోపించారు ఈ సందర్భంగా మంగళవారం నడి కూడ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు కాంట్రాక్టర్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీస్తు జ్యోతి పేరుతో కాంట్రాక్ట్‌ తీసుకుని, సుమారు మూడు ఎకరాల్లో టెండర్‌ ద్వారా మైనింగ్‌ అనుమతులు పొందినట్లు తెలిపారు.అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు టిప్పర్లతో రహదారికి మొరం పోస్తుండగా స్థానిక సర్పంచ్‌ కొంగంటి తిరుపతి అడ్డుకుని, గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని కుమారస్వామి రాధిక పేర్కొన్నారు. చుట్టుపక్కల రైతులకు ఇబ్బందులు కలుగుతాయంటూ తమపై ఒత్తిడి తెస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు.మైనింగ్‌ పనుల వల్ల చుట్టుపక్కల రైతులకు, గుట్టపై ఉన్న దేవాలయాలకు, సమీపంలోని వాగుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తి బాధ్యత తీసుకుంటామని కాంట్రాక్టర్‌ తెలిపారు. తమకు మంజూరైన అనుమతుల పరిధిలో, నిర్దేశించిన హద్దులు దాటకుండా మాత్రమే పనులు చేపడతామని స్పష్టం చేశారు. గ్రామస్తులు వాస్తవాలను గమనించి తమకు సహకరించాలని కుమారస్వామి రాధిక కోరారు. దళిత కాంట్రాక్టర్లను ఎదిగనివ్వకుండా ఇలాగనే అడ్డంకు గురి చేస్తే అదే గ్రామంలో సాకి రేవు గుట్టపై కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు ఇప్పటికే అనుమతులతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు పనులు చేపట్టకుంటే కుటుంబం మొత్తం రోడ్డున పడే కాలం వస్తుందని మా కుటుంబానికి మరణమే శరణ్యమా అనే విధంగా ఉందని కాంట్రాక్టర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను ఓసిగొలిపి అడ్డంకులు చేస్తున్నారని ఆరోపించారు