Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి

Author
Posted By AKSHAYA NEWS
| 16 Sep 2026, 05:09 PM | TELANGANA
సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి

హనుమకొండ జిల్లా జాక్ అధ్యక్షుడిగా సనత్‌కుమార్‌ పటేల్ నియామకం

పరకాల సెప్టెంబర్ 16 (అక్షయ న్యూస్) :
తెలంగాణ సర్పంచుల సంఘం జాక్‌–2026 సర్పంచుల సంఘం జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరకాల మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్‌కుమార్‌ పటేల్‌ను నియమించారు. ఈ సందర్భంగా సనత్‌కుమార్‌ పటేల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్పంచుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణతో పాటు గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సర్పంచుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జాక్‌ ఆధ్వర్యంలో సమష్టిగా పోరాడుతామని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో అందరి సహకారంతో సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి - Additional Image