Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

Author
Posted By AKSHAYA NEWS
| 02 Oct 2026, 02:44 PM |
శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి

శ్రీ కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

ఆలయ కమిటీ సేవా దృక్పథంతో పనిచేయాలి

శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి - Additional Image


పరకాల అక్టోబర్ 2 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి

పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవాలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గ మాట్లాడుతూ.. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు పదవులను లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమష్టిగా పనిచేయాలని అన్నారు.శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, అలాగే ఆలయానికి సంబంధించిన 4.11 ఎకరాల భూమిని సాధించామని తెలిపారు.ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.మహా రుద్రయాగం, హిందూ సమ్మేళనం, కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని,ఇటీవల కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసి ఆలయ కుంభాభిషేకం నిర్వహణపై చర్చించామని, త్వరలోనే కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరకాల నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి - Additional Image