శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
శ్రీ కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం ఆలయ కమిటీ సేవా దృక్పథంతో పనిచేయాలి పరకాల అక్టోబర్ 2 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవాలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గ మాట్లాడుతూ.. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు పదవులను లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో, భక్తిశ్రద్ధలతో...