Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి

Author
Posted By AKSHAYA NEWS
| 28 Sep 2026, 07:45 PM |
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి

పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం

ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత

నడి కూడ సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి

నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్‌ పరిధిలోని నడికూడ 4వ సెంటర్, గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతోపాటు పోషక విలువలున్న ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు.
ప్రతి నెల అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డేకు చిన్నారుల తల్లిదండ్రులు హాజరై, పిల్లలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పిల్లల అభివృద్ధి, పురోగతిని పరిశీలించడంతోపాటు ఇంటివద్ద కూడా వారికి తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞచేయించారు
కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు నారగాని అనిత, ఉప్పుల రజిత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.