గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి

పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత నడి కూడ సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్: నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్‌ పరిధిలోని నడికూడ 4వ సెంటర్, గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతోపాటు పోషక విలువలున్న ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ప్రతి నెల అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డేకు చిన్నారుల తల్లిదండ్రులు హాజరై, పిల్లలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పిల్లల అభివృద్ధి, పురోగతిని...