Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాగారంలో రైతులు ఫార్మర్ ఐడి చేసుకునే విధానాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర

Author
Posted By AKSHAYA NEWS
| 26 Sep 2026, 06:47 PM |
నాగారంలో రైతులు ఫార్మర్ ఐడి చేసుకునే విధానాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  విజయ్ చంద్ర

నాగారంలో రైతులు ఫార్మర్ ఐడి

పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్:

పరకాల మండలం నాగారం గ్రామ రైతు వేదికలో రైతులు ఫార్మర్ ఐడి చేసుకునే విధానాన్నిజిల్లా వ్యవసాయం అధికారి విజయ్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మర్ ఐడి రైతులు చేసుకోకుంటే పండించిన పంటను అమ్మడం గాని పంట రుణాలు రైతు భరోసాపీఎం కిసాన్,ఎరువులు, వ్యవసాయ పనిముట్లు యంత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు గానీ కోల్పోయే అవకాశం ఉన్నది. రైతులకు ఫార్మర్ ఐడి లబ్ధి గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషిచేస్తున్నది.వ్యవసాయశాఖకు వెన్నెముకలాగ ఏఈవో లు చాలా రకాల పని ఒత్తిడిలు తట్టుకుంటూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం పలుమార్లు రైతులకు ఫోన్ చేయడం, ఇంటింటికి తిరగడం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించడం. లిస్టు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ప్రజా ప్రతినిధులు గాని రైతులు గాని ఏఈవోలకు సహకరించి ఫార్మర్ ఐడి చేసుకొని రైతులకు చేపించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం సర్పంచ్ ఏరుకొండ రమ శ్రీనివాస్ ఏఈఓ కాటంరాజు , రైతులు కిరణ్ ప్రతాపు, మొగిలి, సదానందం మొదలైన రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి