Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రక్తదానం చేసిన అలియాబాద్ సర్పంచ్ సనత్ కుమార్

Author
Posted By AKSHAYA NEWS
| 22 Oct 2026, 07:35 PM |
రక్తదానం చేసిన అలియాబాద్ సర్పంచ్  సనత్ కుమార్

పోలీసు అమరవీరులకు ఘన నివాళి..


పరకాల అక్టోబర్ 22 అక్షయ న్యూస్:


పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పరకాల మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ పాల్గొని రక్తదానం చేశారు. తనతో పాటు గ్రామానికి చెందిన యువకులను సైతం రక్తదానానికి ప్రోత్సహించి శిబిరానికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని అన్నారు. అలాంటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎస్బీ టు ఏసీపీ జాన్ నర్సింలు, పరకాల ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు పవన్, రణధీర్, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐ పరమేష్, ఆత్మకూరు సీఐ బాబూలాల్, ఎస్‌ఐ తిరుపతి, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు తదితరులు పాల్గొని రక్తదానం చేసి అమరవీరులకు నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి