Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీసుల త్యాగాలు మరువలేనివి

Author
Posted By AKSHAYA NEWS
| 22 Oct 2026, 03:48 PM |
పోలీసుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన కౌన్సిలర్ పూర్ణ చారి

పరకాల అక్టోబర్ 22 అక్షయ న్యూస్:

పరకాల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పరకాల మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి రక్తదానం చేసి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్ణ చారి మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి సేవలను కొనియాడాలనిపిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎస్బీ టు ఏసీపీ జాన్ నర్సింలు, పరకాల ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు పవన్, రణధీర్, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐ పరమేష్, ఆత్మకూరు సీఐ బాబూలాల్, ఎస్‌ఐ తిరుపతి, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు తదితరులు పాల్గొని రక్తదానం చేసి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి