Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాల అమరవీరుల చరిత్రకు తగిన గుర్తింపు, జిల్లా హోదా, ఏది..!

Author
Posted By AKSHAYA NEWS
| 10 Oct 2026, 04:08 PM |
పరకాల అమరవీరుల చరిత్రకు తగిన గుర్తింపు, జిల్లా హోదా, ఏది..!

పరకాల ఘన చరిత్రను పాతాళంలోకి తొక్కిన బి ఆర్ ఎస్

పాలాభిషేకాలు కాదు ధర్మారెడ్డీ.. పరకాలకు జిల్లా హోదా ఎందుకు తేలేదో చెప్పు..

పరకాల అమరవీరుల చరిత్రకు తగిన గుర్తింపు, జిల్లా హోదా, ఏది..! - Additional Image


బిజెపి నేతలు బిజెపి పార్టీ కార్యాలయం నుంచి అమరధామం వరకు అర్థనగ్న నిరసన ర్యాలీ

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..

ఇవి కూడా చదవండి

బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది

వినూత్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు


పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్:

పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించకుండా, జిల్లా హోదా కల్పించకుండా అన్యాయం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అమరధామం వరకు వినూత్న నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పరకాలకు జిల్లా హోదా కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే
అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, పరకాల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చల్లా ధర్మారెడ్డి ఈ ప్రాంతానికి జిల్లా హోదా సాధించడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పదేళ్ల పాలనలో పరకాలకు జిల్లా హోదా తీసుకురాలేకపోయిన చల్లా ధర్మారెడ్డి, ఇప్పుడు ఏం సాధించామని పాలాభిషేకాల రాజకీయాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. పరకాలకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పకుండా రాజకీయ ఆర్భాటాలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.ఈ కార్యక్రమం లో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఆర్పి జయంతి లాల్, దేవునూర్ మేఘనాథ్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న,మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్, నడి కూడ మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్,పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి,గుండె బోయిన నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు