Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం

Author
Posted By AKSHAYA NEWS
| 29 Sep 2026, 06:02 PM |
పరకాల  పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం

6 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం..

పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అదనపు కలెక్టర్ బి శేషాద్రి డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత మున్సిపల్ కమిషనర్ పవన్

పరకాల  పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం - Additional Image


పరకాల సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి


పరకాల పురపాలక సంఘం కార్యాలయం
లో మంగళవారం మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ శ బి. శేషాద్రి , డిప్యూటీ కలెక్టర్ టి. రోహిత్ , మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ , మున్సిపల్ వైస్ చైర్పర్సన్ , వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీకి సంబంధించిన 6 అంశాలను కౌన్సిల్ సమావేశం ముందుకు తీసుకురావడం జరిగింది. కౌన్సిల్ సభ్యులు ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించి, సభ్యుల సమ్మతితో అన్ని 6 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, పట్టణ అభివృద్ధి మరియు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే దిశగా కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. పట్టణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు