Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అందుబాటులో సబ్సిడీపై శనగ విత్తనాలు..

Author
Posted By AKSHAYA NEWS
| 26 Sep 2026, 06:35 PM |
అందుబాటులో సబ్సిడీపై శనగ విత్తనాలు..

వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్..

పరకాల, సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్:

మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పరకాల మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ తెలిపారు. పరకాల రైతు వేదిక వద్ద మొత్తం 31 బస్తాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో బస్తాలో 16 కిలోల విత్తనాలు ఉంటాయని, బస్తా పూర్తి ధర రూ.1,492 కాగా ప్రభుత్వం రూ.960 సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. సబ్సిడీ అనంతరం రైతులు ఒక్కో బస్తాకు రూ.432 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పరకాల రైతు వేదికకు వచ్చి శనగ విత్తనాలను పొందాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి