Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణేష్ నిమజ్జనం, ఎస్ఐఆర్ పురోగతి, భూభారతి దరఖాస్తులు, పెండింగ్ ఫైళ్లపై సమీక్ష

Author
Posted By AKSHAYA NEWS
| 22 Sep 2026, 06:02 PM |
గణేష్ నిమజ్జనం, ఎస్ఐఆర్ పురోగతి, భూభారతి దరఖాస్తులు, పెండింగ్ ఫైళ్లపై సమీక్ష

గణేష్ నిమజ్జనం, ఎస్ఐఆర్ పురోగతి, భూభారతి దరఖాస్తులు, పెండింగ్ ఫైళ్లపై సమీక్ష

ఆర్డిఓ డిఎస్ వెంకన్న


పరకాల సెప్టెంబర్ 22 (అక్షయ న్యూస్) :
మంగళవారం పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న అధ్యక్షతన డివిజన్ పరిధిలోని గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, ఎస్ఐఆర్ పురోగతి, భూభారతి దరఖాస్తులు మరియు రెవెన్యూ సంబంధిత పెండింగ్ ఫైళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి గారు డివిజన్ పరిధిలో ఎస్ఐఆర్ పురోగతి, భూభారతి దరఖాస్తుల విచారణ, రెవెన్యూ సంబంధిత పెండింగ్ సమస్యలు, రీ-సర్వే పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఫైళ్లను పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి