Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోచారంలో నోటీసుల విచారణ ప్రక్రియను పరిశీలించిన పరకాల ఆర్డీఓ వెంకన్న

Author
Posted By AKSHAYA NEWS
| 11 Sep 2026, 04:52 PM | TELANGANA
పోచారంలో నోటీసుల విచారణ ప్రక్రియను పరిశీలించిన పరకాల ఆర్డీఓ వెంకన్న

పరకాల సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) :
పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా, పరకాల మండలంలోని పోచారం గ్రామం నందు నిర్వహించిన ఎస్ ఐ ఆర్ నోటీసుల విచారణ కార్యక్రమం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి, వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న నోటీసు విచారణ ప్రక్రియకు ఆయన పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలు మరియు ఓటరు జాబితా ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.స్థానిక ఓటర్లతో ఓటరు జాబితాలోని చేర్పులు, మార్పులు, అభ్యంతరాలు, కొత్త ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. నోటీసులు విచారణ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టి విజయలక్ష్మి, తహసిల్దార్ పరకాల, డిప్యూటీ తహసిల్దార్ ఏ సుమన్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి .దామోదర్ , కృష్ణంరాజు బూత్ లెవెల్ సూపర్వైజర్ మరియు జిపిఓ లావణ్య బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.