పోచారంలో నోటీసుల విచారణ ప్రక్రియను పరిశీలించిన పరకాల ఆర్డీఓ వెంకన్న
పరకాల సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) : పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా, పరకాల మండలంలోని పోచారం గ్రామం నందు నిర్వహించిన ఎస్ ఐ ఆర్ నోటీసుల విచారణ కార్యక్రమం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి, వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న నోటీసు విచారణ ప్రక్రియకు ఆయన పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలు మరియు ఓటరు జాబితా ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా...