Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విజ్ఞాన్ పాఠశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Author
Posted By AKSHAYA NEWS
| 09 Oct 2026, 07:19 PM |
విజ్ఞాన్ పాఠశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

విజ్ఞాన్ పాఠశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

కమలాపురం, అక్టోబర్ 9 అక్షయ న్యూస్:

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు కమలాపురం మండలం శనిగరంలోని విజ్ఞాన్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, చుట్టూ కోలాటాలు వేస్తూ ఆడి పాడారు. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐల. భాస్కర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడపడుచుల గొప్పతనానికి, ప్రకృతితో మమేకమైన జీవనానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చివరగా అందరికీ పాఠశాల యాజమాన్యం బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపింది.

ఇవి కూడా చదవండి