Home

పోలీసు అమరులకు ఘన నివాళి

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హనుమకొండ ప్రతినిధి అక్టోబర్ అక్షయ న్యూస్: అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లోని అమరుల స్తూపం వద్ద హనుమకొండ,వరంగల్ జిల్లాల కలెక్టర్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ పోలీసు అమరులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు హనుమకొండ...

దసరా వేడుకలలో పరకాల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.!.

పరకాల రావణాసురుని వదలో ఎమ్మెల్యే చేతిలో పనిచేయని రిమోట్..! ఎమ్మెల్యేకు బదులుగా అగ్గిపెట్టతో అంటించిన ఓ వ్యక్తి..! దసరా వేడుకలకు నామమాత్రపు ఏర్పాటు చేశారని పట్టణ ప్రజల నుండి పలు విమర్శలు .. పరకాల అక్టోబర్ 20 అక్షయ న్యూస్: పరకాల పట్టణ కేంద్రంలో మంగళవారం విజయదశమి ని పురస్కరించుకుని పశువుల సంతలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రావణాసురుని వద కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి రావణాసురుని వద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా...

గుర్తు తెలియని వృద్ధురాలు మృతి – ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలి

పరకాల అక్టోబర్ 20 అక్షయ న్యూస్ దామెర గ్రామ శివారులోని శ్లోక స్కూల్ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పాదుల వద్ద గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది.మృతురాలి వివరాలు తెలిసినవారు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు – 8712585228 లేదా దామెర పోలీస్ స్టేషన్ 8712685020 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని దామెర పోలీసులు కోరుతున్నారు.

నాగారం గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు...

పరకాల అక్టోబర్ 20 అక్షయ న్యూస్: పరకాల మండలం నాగారం గ్రామంలో విజయదశమి సందర్భంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు గ్రామంలో భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయుధ పూజలు చేసి బోనాలు సమర్పించి సొరకాయ కొట్టి రెండు గొర్రె పిల్లలను బలి ఇచ్చి గొర్రె పిల్లల నెత్తురుతో గ్రామ ప్రజలందరూ మొదట బొట్టు పెట్టుకుని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎలాంటి ప్రపంచీయ సంఘటనలు జరగకుండా పరకాల పోలీస్ బృందం నిఘాతో దసరా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది

పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆయుధ పూజ నిర్వహించిన వరంగల్ సిపి.ఎన్.శ్వేత ఐపిఎస్

ఆయుధ భాండాగారం, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు. ప్రజలకు, పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్. హనుమకొండ అక్టోబర్ 20 అక్షయ న్యూస్: మంగళవారం విజయదశమి పర్వదిన వేడుకలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ, భక్తిశ్రద్ధలతో ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో వరంగల్ పోలీస్ కమిషనర్ , పోలీసు అధికారులు వేద పండితులతో సాంప్రదాయబద్ధంగా దుర్గామాత...

పరకాల శివాలయాన్ని దర్శించుకున్న రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న

పరకాల అక్టోబర్ 19 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలోని పురాతన శివాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న దర్శించుకున్నారు.వారి వెంట పరకాల మండల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఉన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో శివయ్యకు ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, పరకాల ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం...

యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి డాక్టర్ పగడాల

పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్: పరకాల మండలం నాగారం గ్రామంలో మార్క అజయ్, ఏరుకొండ రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు క్రీడాకారులకుక్రికెట్ కోసం అనౌన్స్మెంట్ స్పీకర్ బాక్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. బీజేవైఎం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్...

పరకాల ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్ : పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దామెర చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గా మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతిపై ప్రేమకు ప్రతిబింబమని అన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఏసిపి సతీష్...

నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

నాగారం గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్: ఏడాదికి ఒకసారి జరుపుకునే సద్దుల బతుకమ్మ సంబరాలు పరకాల మండలం నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలో ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలు నేర్చుకొని రంగురంగుల చీరలతో ముస్తాబై వాడవాడలా ఆడపడుచులందరూ ఏకమై బతుకమ్మలు అన్ని ఒకచోట పెట్టుకొని డీజే పాటలకు కోలాటాల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు గ్రామ సర్పంచ్ నేతృత్యంలో అన్ని రకాల సౌకర్యాలు...

యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం నిరసన ర్యాలీ

రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం, విద్యార్థినిల స్కూటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ పరకాల అక్టోబర్ 17 అక్షయ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పరకాల పట్టణ అధ్యక్షుడు దాసరి ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పరకాలలోని బీజేపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌లోని అంబేడ్కర్ సెంటర్ వరకు బీజేవైఎం నాయకులు ర్యాలీ చేపట్టి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన...

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయండి.

హనుమకొండ సిఐటియు జిల్లా కోశాధికారి. బోట్ల చక్రపాణి పిలుపు పరకాల అమరధామంలోచలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది సిఐటియు కార్మికుల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ పరకాల అక్టోబర్ 17 అక్షయ న్యూస్: ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. ఈనెల 26న జరిగే ఇంద్ర పార్క్. హైదరాబాద్ లో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని. జయప్రదం చేయాలని. శనివారం పరకాల అమరధామంలో. చలో హైదరాబాద్. పోస్టర్ ఆవిష్కరణ...

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పాత వస్తువుల బహిరంగ వేలంపాట నిర్వహణ

హనుమకొండ అక్టోబర్ 17 అక్షయ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పాడైపోయిన పాత సామగ్రి విక్రయానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో సుమారు 40 మంది వ్యాపారులు పాల్గొన్నారు. వరంగల్ ఆటోనగర్‌కు చెందిన పటేల్ ఖాన్ పాత సామగ్రిని రూ.7,30,000 లకు వేలంపాట లో దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) సురేష్, ఏసీపీ...

పైడిపల్లిలో నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు..

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తాం.. ఏడీఈ దేవేందర్‌ పరకాల, అక్టోబర్‌ 16: అక్షయ న్యూస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పైడిపల్లి గ్రామంలో నూతన విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి లైటింగ్‌ పనులు చేపట్టినట్లు పరకాల ఏడీఈ (ఆపరేషన్‌) దేవేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ సరఫరాలో అంతరాయాలు కలగకుండా...

పరేషాన్‌లో పరకాల పురవీధులు..!

కంపు కొడుతున్న కాలనీలు.. అనారోగ్య భయంతో పట్టణ ప్రజలు పండుగ వేళా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. కార్యాలయం కదలని కమిషనర్‌! పరకాల, అక్టోబర్ 16 (అక్షయ న్యూస్): పరకాల పట్టణ పురవీధులు, కాలనీలు అపరిశుభ్రతతో కంపు కొడుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఆనందంగా గడపాల్సిన సమయంలో చెత్తాచెదారం, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి....

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆడిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్ల నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ తార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ మరియు సెంట్రల్ జోన్ డీసీపీలు స్వయంగా సంప్రదాయ పాటలను...

సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునిల్ కుమార్

పరకాల అక్టోబర్ 15 అక్షయ న్యూస్: పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధి అంగడి మైదానంలో త్వరలో జరగబోయే సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా లైటింగ్ మరియు పారిశుద్ధ పనులను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరిశీలించారు, వారితో పాటుగా మున్సిపల్ కౌన్సిలర్ బండి శ్రీధర్,అల్లె దశరథం పోరండ్ల వేణు,గొడుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

రవాణా ట్రాన్స్పోర్ట్ ఆటో మొబైల్స్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా జనగాం శ్రీధర్ గౌడ్

హనుమకొండ అక్టోబర్ 15 అక్షయ న్యూస్: హైదరాబాద్ జిల్లా రవాణా ట్రాన్స్‌పోర్ట్ ఆటోమొబైల్స్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా జనగాం శ్రీధర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అందే శ్రీనివాస్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి...

*సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

*ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలి* *సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునేలా చూడాలి* పరకాల అక్టోబర్ 14 అక్షయ న్యూస్ పరకాల పట్టణ కేంద్రంలో మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్ద బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానాన్ని,బతుకమ్మలు వేసే దామరచెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను మరియు దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతాన్ని గడి ప్రాంతాన్ని మరియు రతాన్ని తీసుకుపోయే చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంతాల వద్ద జరుగుతున్న పనులను మరియు...

అంగరంగ వైభవంగా భవాని మాలదారులకు అన్నప్రసాద వితరణ చేసిన తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి..

పరకాల అక్టోబర్ 13 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడునటువంటి భవాని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భవాని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మాలదారులకు కండవదారులకు అన్న ప్రసాద వితరణ చేయించిన స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జంకి పూర్ణాచారి,, ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,,

పరకాల జిల్లా హోదాపై బహిరంగ చర్చకు సిద్ధం.... మీరు సిద్ధమా..

బీఆర్ఎస్‌ నాయకుల సవాల్‌ కు ప్రతి సవాల్ విసిరిన బీజేపీ నాయకుడు-ఆకుల శ్రీధర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు తేదీ, సమయం ప్రకటించాలి. పరకాల అక్టోబర్ 13 అక్షయ న్యూస్: బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీని విమర్శించే ముందు పదేళ్ల పాలనలో పరకాలకు జిల్లా హోదా ఎందుకు కల్పించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ జిల్లా నాయకుడు ఆకుల శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. పరకాల అభివృద్ధి, జిల్లా హోదా అంశాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధంగా ఉంటే తేదీ, సమయం, స్థలం ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.తెలంగాణలో...