భూపాలపల్లి డీఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
ఇద్దరు అధికారుల అరెస్ట్.. రూ.39.14 లక్షలు కాంట్రాక్టర్ల నుంచి బదిలీ బిల్లుల చెల్లింపులకు పర్సంటేజీలు.. ఫోన్లలో బయటపడ్డ బాగోతం.. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య.. లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.. జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి, అక్టోబర్ 22 అక్షయ న్యూస్: భూగర్భ జలాలను పెంపొందించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయాల్సిన వాటర్‌షెడ్ ప్రాజెక్టులో అవినీతి బాగోతం వెలుగుచూసింది. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన పనుల్లో పర్సంటేజీల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారం ఏసీబీ తనిఖీలతో బట్టబయలైంది. కాంట్రాక్టర్ల నుంచి ఏకంగా రూ.39.14 లక్షలు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య...