పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఆయుధ పూజ నిర్వహించిన వరంగల్ సిపి.ఎన్.శ్వేత ఐపిఎస్
ఆయుధ భాండాగారం, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు. ప్రజలకు, పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్. హనుమకొండ అక్టోబర్ 20 అక్షయ న్యూస్: మంగళవారం విజయదశమి పర్వదిన వేడుకలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ, భక్తిశ్రద్ధలతో ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో వరంగల్ పోలీస్ కమిషనర్ , పోలీసు అధికారులు వేద పండితులతో సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక ఆయుధ పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా ఉన్న విజయదశమి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం...