యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి డాక్టర్ పగడాల

పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్: పరకాల మండలం నాగారం గ్రామంలో మార్క అజయ్, ఏరుకొండ రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు క్రీడాకారులకుక్రికెట్ కోసం అనౌన్స్మెంట్ స్పీకర్ బాక్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. బీజేవైఎం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే...