పరేషాన్లో పరకాల పురవీధులు..!
కంపు కొడుతున్న కాలనీలు.. అనారోగ్య భయంతో పట్టణ ప్రజలు పండుగ వేళా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. కార్యాలయం కదలని కమిషనర్! పరకాల, అక్టోబర్ 16 (అక్షయ న్యూస్): పరకాల పట్టణ పురవీధులు, కాలనీలు అపరిశుభ్రతతో కంపు కొడుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఆనందంగా గడపాల్సిన సమయంలో చెత్తాచెదారం, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. *పండుగ వేళా పరేషాన్ లో పారిశుధ్యం?* పండుగల సమయంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఉంది. అయితే...