ఈ నెల 13 న రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన చలో సెక్రటేరియట్ దిగ్విజయం చేయాలి
రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధర్మేంద్ర హనుమకొండ అక్టోబర్ 11 అక్షయ న్యూస్: రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13 న ఏర్పాటు చేసిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం లో రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వానికి మన సత్తా చూపించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడు ధర్మేంద్ర పిలుపునిచ్చారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ గఫార్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా పరిషత్ ఆవరణలో యున్న పీఆర్టీయూ బవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చలో సెక్రటేరియట్ పోస్టర్ ను ఆవిష్కరించారు...