తొలిరోజు బతుకమ్మ వేడుకలలో యువతుల సంబరాలు
పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్: ఏడాదికి ఒకసారి వచ్చే సద్దుల బతుకమ్మ సంబరాలు తొలిరోజు ప్రారంభం కావడంతో పరకాల మండలం నాగారం గ్రామం పాత గ్రామపంచాయతీ పరిసరాల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలలో యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున ఆటపాటలతో డ్యాన్సులతో సంబరాలు అంబరాన్నంటాయి తొలిరోజే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చుకొని ఆడపడుచులు ముస్తాబయి ఒకచోట బతుకమ్మను పేర్చుకొని ఆటపాటలతో అలరించే సరికి నాగారం గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది