గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: చల్లా ధర్మారెడ్డి
అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి.. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి. పరకాల అక్టోబర్ 5 అక్షయ న్యూస్: పరకాల:వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని సూచించారు.సోమవారం పరకాల పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడి ఓటరు నమోదు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ...