జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటుకై డిమాండ్ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజుకు వినతి హనుమకొండ అక్టోబర్ 2 అక్షయ న్యూస్ : జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐజేయూ అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజేే) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. బ్యానర్‌ పట్టుకుని సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు....