అక్రమ గృహ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని రీజనల్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు
ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఏకు శంకర్ మాదిగ పరకాల, అక్టోబర్ 1 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలోని గొడ్ల అంగడి ముందు, ఇంటి నంబర్ 3-277 వద్ద మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ రీజనల్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఏకు శంకర్ మాదిగ ఫిర్యాదు చేశారుఈ సందర్భంగా గురువారం శంకర్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ.. సదరు గృహ నిర్మాణానికి సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణం జరుగుతోందా లేదా అనే విషయాన్ని అధికారులు...