జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

‘ జర్నలిస్టుల హక్కుల డిమాండ్ల దినోత్సవం’ విజయవంతం చేయాలి హనుమకొండ సెప్టెంబర్ 30 అక్షయ న్యూస్: :జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ‘డిమాండ్ల దినోత్సవం’ను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం కోరారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే...