మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న
పరకాల, సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న అన్నారు.మంగళవారం పరకాలలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, హనుమకొండ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, కార్మిక శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలన అంశాలపై సమీక్ష మరియు సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న అధ్యక్షత వహించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి, ఆశలు చూపి కొందరు సంఘటితంగా మానవ...