పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు..
జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు చర్లపల్లి మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్.. మీడియా సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు. నడి కూడ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్: నడికుడ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నడికుడ మండల సమన్వయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం మరియు శాసనసభ్యుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని తెలియజేశారు. మండలంలోని మూడు గ్రామాల...