పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం
ప్రైవేటుకు దీటుగా ఆధునిక వైద్య సదుపాయాలు ఓపి సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి. జిల్లా కలెక్టర్ .మున్సిపల్ చైర్మన్. పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను శనివారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో గణపతి పూజలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఫార్మసీ, జనరల్ వార్డు, గైనకాలజీ, ఏఎన్‌సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సేవలందించారు....