చైనాలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి హనుమకొండ బాలిక ఎంపిక
చైనాలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి హనుమకొండ బాలిక ఎంపిక హనుమకొండ సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్: :హనుమకొండకు చెందిన యువ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి వేల్పుల సాయి వర్షిణి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. హనుమకొండలోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిణి గత నాలుగు సంవత్సరాలుగా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ పొలెపాక వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ పొందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఆమె, వరంగల్‌లో , మెదక్‌లో , నిజామాబాద్‌లో రాష్ట్రస్థాయి మీట్స్‌లో పాల్గొంది.అదేవిధంగా ఔరంగాబాద్‌లో అండర్-15 బాలికల...