పరకాలలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

పరకాలలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి పరకాల,సెప్టెంబర్21, (అక్షయ న్యూస్) : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సోమవారం పరకాల పట్టణ కేంద్రంలో పదవులు ఘనంగా నిర్వ‌హించారు. బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని పలువురు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్...