యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి
ది పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు పరకాల, సెప్టెంబర్ 18 : (అక్షయ న్యూస్) రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీలకు సంబంధించిన చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని ది పరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు.ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో...