యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్,డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకన్న హనుమకొండ , సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్) : రైతులకు అవసరమైన ఎరువులు,పురుగు మందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీలకు సంబంధించిన చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని *తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులవినియోగం రోజురోజుకూ పెరుగుతోందని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగాఎరువులు,పురుగుమందులు , విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు...