బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం,
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పరకాల సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) : పరకాల పట్టణ కేంద్రంలో పట్టణ బిజెపి అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు , సీనియర్ నాయకులు డా. సిరింగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా శక్తి స్థల్...