బడి పంతుల్ల గలాట - బయటపడ్డ బాగోతం..!

ముఖ్యమైనవి:పాఠశాలలో పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..ప్రభుత్వ పంతుల్ల పరస్పరం ఆరోపణలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయులు అక్షయ వెబ్ న్యూస్ సెప్టెంబర్ 8 నడి కూడ సమ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా నడికూడ మండలం వరికోలు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం నిధుల ఖర్చుపై మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తల్లిదండ్రుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.పీఎం శ్రీ నిధుల ఖర్చుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా, తమకు...