భూపాలపల్లి వాటర్‌షెడ్ ప్రాజెక్టు కార్యాలయంలో ఏసీబీ సోదాలు!
ఐడీఓసీలో అధికారుల తనిఖీలు.. ఫైళ్లు, రికార్డుల పరిశీలన..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, (జనంసాక్షి):
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయమైన ఐడీఓసీలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపాయి. ఐడీఓసీలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) కార్యాలయంలో వాటర్‌షెడ్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి, ప్రాజెక్టుకు సంబంధించిన పలు ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు, నిధుల వినియోగం, బిల్లులు, పనుల పురోగతికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే
ఏసీబీ సోదాలకు గల కారణాలు ఏమిటి? ఏవైనా అవినీతి ఆరోపణలు, ఆర్థిక అక్రమాల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సోదాలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. అధికారుల ప్రకటన వెలువడితేనే తనిఖీల వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.