🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

Main Image

నాగారం గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్

పరకాల అక్టోబర్ 18 అక్షయ న్యూస్: ఏడాదికి ఒకసారి జరుపుకునే సద్దుల బతుకమ్మ సంబరాలు పరకాల మండలం నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలో ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలు నేర్చుకొని రంగురంగుల చీరలతో ముస్తాబై వాడవాడలా ఆడపడుచులందరూ ఏకమై బతుకమ్మలు అన్ని ఒకచోట పెట్టుకొని డీజే పాటలకు కోలాటాల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు గ్రామ సర్పంచ్ నేతృత్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఆడపడుచులు సంబరాలలో మునిగిపోయారు ముఖ్యంగా యువత డ్యాన్సులతో చిందులేస్తూ అలరించే విధంగా నృత్యాలు చేశారు అనంతరం నాగారం గ్రామ ప్రజలందరికీ గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు


🏠 Home