🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఈ నెల 13 న రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన చలో సెక్రటేరియట్ దిగ్విజయం చేయాలి

Main Image


రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధర్మేంద్ర


హనుమకొండ అక్టోబర్ 11 అక్షయ న్యూస్:

రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13 న ఏర్పాటు చేసిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం లో రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వానికి మన సత్తా చూపించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడు ధర్మేంద్ర పిలుపునిచ్చారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ గఫార్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా పరిషత్ ఆవరణలో యున్న పీఆర్టీయూ బవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చలో సెక్రటేరియట్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమార్చి 2024 తర్వాత రిటైర్
అయిన ఉద్యోగులకు రావలసిన బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రములు ,ధర్నాలు చేసిన స్పందించకపోవడం వల్ల దాదాపు 200 మంది చనిపోయారని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు గ్రూప్ ఇన్స్యూరెన్స్ జి పి యఫ్ TSGLI, LEAVE ENCASHMENT మరియు ప్రభుత్వం ఇవ్వవలసిన గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13 ఉదయం 11 గంటలకు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హాజరు కావలసినదిగా కోరారు ఈ సమావేశంలో మేకిరి దామోదర్, పెద్ది ఆంజనేయులు, సంజీవరెడ్డి, సారయ్య, గణపతి, సాంబా రెడ్డి ,పి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు
🏠 Home