సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదా రామకృష్ణ
పరకాల అక్టోబర్ 6 అక్షయ న్యూస్:
సఫాయి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదా రామకృష్ణ కోరారు. భారత జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ (ఎన్‌సీఎస్‌కే) వైస్ చైర్మన్ హర్దీప్ సింగ్ గిల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా సఫాయి కార్మికులను కాంట్రాక్టు విధానం నుంచి తప్పించి ప్రభుత్వమే నేరుగా నెలసరి వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ హర్దీప్ సింగ్ గిల్‌ను సోదా రామకృష్ణ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ వాల్మీకి, హైదరాబాద్ సిటీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దేవేందర్ చిండాలియా తదితరులు పాల్గొన్నారు.