🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

కార్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

Main Image


హనుమకొండ అక్టోబర్ 5 అక్షయ న్యూస్:

:హనుమకొండ సుబేదారిలోని జిల్లా పరిషత్ కు సంబంధించిన స్థలం, శిథిలావస్థకు చేరిన భవనాలు, ఖాళీ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సోమవారం పరిశీలించారు
.హనుమకొండ తహసీల్దార్ కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. క్వార్టర్స్, ఖాళీ స్థలానికి సంబంధించిన వివరాలను జెడ్పీ సీఈఓ శేషాద్రి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు కలెక్టర్‌కు వివరించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంను కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home