కౌకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చి అన్యాయం చేశారు..
పత్రికా సమావేశంలో వెల్లడించిన చుక్క నవీన్..
నడి కూడ అక్టోబర్ 4 అక్షయ న్యూస్ :
నడికూడ మండలం కౌకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చి అన్యాయం చేశారని గ్రామానికి చెందిన చుక్క నవీన్ ఆరోపించారు. ఆదివారం నడికుడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రిక సమావేశంలో చుక్క నవీన్ మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్తాల రాజు .మేకల రఘుపతి. చుక్క కుమారస్వామి. సర్పంచ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని అట్టి ఖర్చు మేమే భరిస్తామని అలాగైతే బి.ఆర్.ఎస్ పార్టీని ఓడించవచ్చని హామీ ఇచ్చి నామినేషన్ వేయించడం జరిగిందని వేసినా అనంతరం పెట్టిన ఖర్చులు ఇవ్వకుండా నాపైనే దురుసుగా ప్రవర్తించడం జరిగిందని ఆరోపించారు. వారి ముగ్గురు వలన 36000 ఎన్నికలకు ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు అదేవిధంగా నిరుపేదనైనా నాకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఒకవైపు నామినేషన్ వేయించి ఖర్చు పెట్టించారు మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని తెలిపారు నాకు హామీ ఇచ్చి నాకు అన్యాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని పత్రికా సమావేశంలో చుక్క నవీన్ తెలియజేశారు