పరకాల ఆకుల వాడలో వృద్ధురాలి హత్య, కేసులో నిందితుడి అరెస్ట్
బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్ స్వాధీనం..
48 గంటలలో కేసు చేదించిన సిఐ. ప్రవీణ్ కుమార్ ఎస్ఐ పవన్. రఘు లను అభినందించిన ఏసిపి సతీష్ బాబు
పరకాల అక్టోబర్ 3 అక్షయ న్యూస్:
పరకాల పట్టణంలోని అకులవాడలో వృద్ధ మహిళపై దాడి చేసి హత్య చేసి, మరో వృద్ధ మహిళను తీవ్రంగా గాయపరిచిన కేసులో సీఐ ప్రవీణ్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడం జరిగింది దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా పరకాల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశంలో ఏసిపి సతీష్ బాబు మాట్లాడుతూ పోలీస్ పెట్రోలింగ్ లో భాగంగా శనివారంవెల్లంపల్లి రోడ్డు లోని మున్సిపాలిటీ కార్యాలయం వెళ్ళు దారి వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి పోలీస్ వారిని చూసి పరిపోవటానికి ప్రయత్నించ గా అట్టి నిందితుణ్ణి పట్టుకొని తన పేరు అడుగ గా తన పేరు నేరెళ్ల రమేష్ వయస్సు 38 సంవత్సరాలు, రజక, సెంట్రింగ్ పని, రాంనగర్, అని చెప్పడం జరిగింది అని తెలిపారు అతని వద్ద ఉన్న రెండు బంగారు పుస్తెలు, చూపించి పైన తెలిపిన హత్య నేరం ఒప్పుకోగా వెంటనే ఇద్దరు పంచులను పిలిచి వారి సమక్షంలో అట్టి నిందితుణ్ణి విచారించగా తాగుడుకు బానిస కావడం వలన భార్యా వదిలి వెళ్లడంతో ఆలయాలలో మరియు ఇళ్ళల్లో చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడినని ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. దాంట్లో భాగంగా 30వ తేదీ అర్ధరాత్రి ఆకుల వాడలో ఇల్లు పైకప్పు ఊడదీసి ఇంట్లో దూకి దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఇంటిలో ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు అరిచేసరికి ఇనుపరాడుతూ వారిపై దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే కోడెల సుగుణమ్మ మృతి చెందగా కోడెల లక్ష్మక్క ఎంజిఎం లో చికిత్స పొందడం జరుగుతుందని తెలిపారుఅట్టి నిందితుడు దొంగతనం చేసిన సుమారు 2 గ్రాముల బరువు, విలువ సుమారు రూ.30,000/- స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చూపిన ప్రదేశం అయిన అతని ఇంటి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్, రక్తపు మరకలున్న ఆకుపచ్చ రంగు షర్టు, నీలం రంగు జీసీ ప్యాంట్ స్వాధీనం చేసుకున్నారు. 48 గంటలలో చాకచౌక్యంగా కేసు ఛేదించిన సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్సైలు పవన్ రఘు లను మరియు పోలీస్ సిబ్బందిని ఏసిపి సతీష్ బాబు అభినందించారు