అంగన్వాడీ లో అందించే ఆహారం మే పౌష్టిక ఆహారం..
గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ లో ఇచ్చే పౌష్టిక ఆహారం తీసుకోవాలి
చర్లపల్లి లో పోషణ మాసం పాల్గొన్న సర్పంచ్ బండి రేణుక శంకర్
నడి కూడ ఆగస్టు 3 (జనం సాక్షి) :
నడి కూడ మండలం చర్లపల్లి గ్రామంలో శనివారం ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ,పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని మరియు స్థానికంగా దొరికే పండ్లు ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు సూపర్వైజర్ మాట్లాడుతూ పోషకాహారం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతాన్ని తప్పనిసరిగా అందించి వారి ఆరోగ్యమైన ఎదుగుదలకు తల్లులు సహకరించాలని మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను అంగన్వాడి కేంద్రంలోనే ప్రీస్కూల్ విద్యకు నమోదు చేసుకోవాలని తల్లులకు సూచించారు. ఇందులో భాగంగా పోషణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు ,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తల్లిదండ్రులు ఇతరులు పాల్గొన్నారు.