🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉంచొద్దు

Main Image


హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి

తహసీల్దారులతో అదనపు కలెక్టర్ సమావేశం


హనుమకొండ అక్టోబర్ 1 అక్షయ న్యూస్:

తహసిల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉంచొద్దని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి తహసిల్దార్లను ఆదేశించారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, భూముల రీ సర్వే అంశాలపై అదనపు కలెక్టర్ తహసిల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ ల కోసం చలానా కట్టి మూడు రోజుల ఆగినట్లయితే ఎందుకు ఆపారనే కారణాల వివరాలను తహసిల్దార్లు తెలియ
జేయాలన్నారు. సంబంధిత రిజిస్ట్రేషన్ దారులకు ఎందుకు ఆపినారు అనే విషయాన్ని తెలియజేస్తూ నోటీసు అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ ను సంప్రదించాలని కొనుగోలుదారులకు సూచించారు.ఏవైనా అక్రమాలు జరిగితే తీవ్రంగా పరిగణించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా మండలాల పరిధిలో భూ రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో తహసీల్దారులు పర్యటించాలని అన్నారు. భూ రీ సర్వేలో సర్వేయర్లతో సమన్వయం చేస్తూ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతులతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, తహసిల్దార్లు పాల్గొన్నారు.
🏠 Home