🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

అక్రమ గృహ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని రీజనల్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు

Main Image Additional Image
ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు ఏకు శంకర్ మాదిగ

పరకాల, అక్టోబర్ 1 అక్షయ న్యూస్:

పరకాల పట్టణంలోని గొడ్ల అంగడి ముందు, ఇంటి నంబర్ 3-277 వద్ద మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ రీజనల్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు ఏకు శంకర్ మాదిగ ఫిర్యాదు చేశారుఈ సందర్భంగా గురువారం శంకర్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ.. సదరు గృహ నిర్మాణానికి సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణం జరుగుతోందా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. రోడ్డు ఎఫెక్టెడ్ ఏరియా కింద వదలాల్సిన స్థలాన్ని వదలకుండా నిర్మాణం చేపట్టినట్లు, అలాగే భవనం చుట్టూ నిబంధనల ప్రకారం అవసరమైన ఖాళీ స్థలం లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లు స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.అదేవిధంగా భవనం ముందు భాగంలో రోడ్డు వైపు బాల్కనీని పొడిగించి నిర్మించినట్లు, డ్రైనేజీపై పిల్లర్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. దీనివల్ల ప్రజల రాకపోకలకు, డ్రైనేజీ నిర్వహణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున అధికారులు ఈ అంశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.ఈ నిర్మాణంపై ఇప్పటికే పరకాల మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని శంకర్ మాదిగ తెలిపారు. భవన నిర్మాణ అనుమతి, ఆమోదిత నిర్మాణ ప్రణాళిక, సెట్‌బ్యాక్‌లు, రోడ్డు ఎఫెక్టెడ్ ఏరియా, బాల్కనీ నిర్మాణం, డ్రైనేజీపై ఏర్పాటు చేసిన పిల్లర్లు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.నిర్మాణం సంబంధిత అనుమతులు, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలితే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా స్థలం, రోడ్డు, డ్రైనేజీకి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఏకు శంకర్ మాదిగ కోరారు.

🏠 Home