🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

వరి కోల్ లో పోషణ మాసం పై అవగాహన పాల్గొన్న సర్పంచ్ కుమారస్వామి

Main Image

నడి కూడ సెప్టెంబర్ 30 అక్షయ న్యూస్:

పరకాల ప్రాజెక్టు పరిధిలోని నడి కూడ మండల కేంద్రంలోని నడి కూడ రాయపర్తి సెక్టార్ వరికోల్ నడి కూడ గొల్లపల్లె గ్రామంలో సెక్టార్ స్థాయిలో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ లు హేమలత శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ దొగ్గల కుమారస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని మరియు స్థానికంగా దొరికే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు సూపర్వైజర్ మాట్లాడుతూ పోషకాహారం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చని చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతాన్ని తప్పనిసరిగా అందించి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లులు సహకరించాలని మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్ విద్యకు నమోదు చేసుకోవాలని తల్లులకు సూచించారు ఇందులో భాగంగా పోషణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మురాల భుజంగరావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సరిత, రాధిక, ఏఎన్ఎం స్వప్న ఆశా కార్యకర్తలు రాయపర్తి సెక్టార్ లోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ,గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు మరియు చిన్నా రులుపాల్గొన్నారు
🏠 Home